ప్రపంచ ప్రతిభకు పట్టం కట్టే ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి..!
Publish Date:Dec 10, 2024
Advertisement
స్వీడన్‌కు చెందిన ఆవిష్కర్త, పండితుడు అల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఇమ్మాన్యుయేల్ నోబెల్, కరోలినా ఆండ్రియేట్ నోబెల్ దంపతులకు జన్మించాడు. చిన్న వయస్సులోనే ఇంజనీరింగ్, ముఖ్యంగా పేలుడు పదార్థాలపై ఆసక్తి చూపించారు. తన తండ్రి నుండి మౌలిక ఆవిష్కరణ సూత్రాలను నేర్చుకున్నారు. ఆయన కెరీర్ లో 355 పేటెంట్లను సొంతం చేసుకున్నాడు. ఇందులో డైనమైట్ అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణగా నిలిచింది. తరువాత సింథటిక్ మూలకం "నోబెలియం" ఆయన గౌరవార్థం పేరు పెట్టబడింది. నోబెల్ వారసత్వం.. నోబెల్ ఆవిష్కరణలకంటే ఆయన వారసత్వం ఎక్కువగా కొనసాగింది. డైనమైట్ నుండి మంచి సంపద సొంతం చేసుకుని, నోబెల్ బహుమతుల స్థాపనను ఏర్పరిచాడు. 1901లో ప్రారంభమైన ఈ బహుమతులు ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, రసాయన శాస్త్రం, శాంతి రంగాలలో కృషి చేసిన వారిని గౌరవిస్తాయి. ఈ బహుమతులు నోబెల్ మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దృక్కోణాన్ని ప్రతిబింబిస్తాయి. 1884లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్‌ను సభ్యునిగా ఎన్నుకుంది. 1893లో ఆయన ఉప్సాలా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందాడు. అల్ఫ్రెడ్ నోబెల్ కవిగా కూడా రాణించాడు. నోబెల్ రాసిన ఉత్తరాలలో ఆయన యవ్వన దశలో రాసిన కవితలను ధ్వంసం చేశారని తెలిసింది. "ఎ రిడిల్" అనే కవితా రచనని ఆయన మొదటి కవితగా రచించాడు. నోబెల్ బహుమతి.. 1895 నవంబర్ 27న, పారిస్‌లో అల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి సంతకం చేశాడు. ఇందులో తన సంపదను ఐదు భాగాలుగా విభజించి, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి రంగాలలో కృషి చేసిన వారికి బహుమతులు ఇవ్వాలని పేర్కొన్నాడు. బహుమతులు ఇవ్వడంలో అభ్యర్థుల జాతి, పుట్టుపూర్వకతను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రతిభ ఉన్నవారికి బహుమతి ఇవ్వాలని నా స్వంత కల అని నోబెల్ ప్రస్తావించాడు. నోబెల్ యొక్క ఆవిష్కరణలు, కృషి.. నైట్రోగ్లిసరిన్ ఫ్యాక్టరీ (1862): నోబెల్ పేలుడు పదార్థాల పరిశ్రమకు పునాది వేసాడు. డైనమైట్ (1867): డైనమైట్‌ను ఆవిష్కరించడానికి నోబెల్ నైట్రోగ్లిసరిన్‌తో కీసెల్గుర్‌ను కలిపి ఒక సురక్షితమైన ఉత్పత్తిని తయారుచేసారు. బ్లాస్టింగ్ జెలటిన్ (1875): 1875లో ఆయన బ్లాస్టింగ్ జెలటిన్‌ను ఆవిష్కరించారు. నోబెల్ ఆవిష్కరణలు, విశ్వనాగరిక శ్రేయస్సుకు చేసిన కృషి ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. నోబెల్ వారసత్వం, ఆయన చేపట్టిన పనులు మానవాళి మీద అమూల్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
నోబెల్ బహుమతి.. ప్రపంచం మొత్తం మీద ఎంతో గొప్పగా పేర్కొనే గుర్తింపు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు నోబెల్ బహుమతి సాధించాలనే తపనతో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఒక గొప్ప ఆవిష్కరణ సాధ్యం చేసిన వారికి నోబెల్ బహుమతి ప్రధానం చేయబడుతుంది. ఇది కూడా కొన్ని వర్గాల వారికే ఇవ్వబడుతుంది. భారతదేశానికి భారత రత్న ఎలాంటిదో ప్రపంచానికి నోబెల్ బహుమతి అలాంటిది. అసలు నోబెల్ బహుమతి ఎలా పుట్టింది? నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారు? దీని విలువ ఎంత? తెలుసుకుంటే..
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో నిర్వహించే నోబెల్ బహుమతి కార్యక్రమం అల్ఫ్రెడ్ నోబెల్ మరణాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు. నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబరులో జరుగుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/alfred-nobel birth-anniversary-35-189664.html